- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajya Sabha Nominations: రాజ్యసభకు మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. తుది రేసులో ఉన్నది వీళ్లే!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాజ్యసభ (Rajya Sabha)కు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాలతో ఖాళీ అయిన మూడు స్థానాలకు గాను ఇవాళ్టి నుంచి నామినేషన్ల (Nominations)ను స్వీకరించనున్నారు. డిసెంబర్ 10తో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. కాగా, వైసీపీ (YCP) నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగిన మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana), బీదా మస్తాన్ రావు (Bida Mastan Rao), బీసీ నాయకుడు అర్.కృష్ణయ్య (R.Krishnaiah) రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింటికి నాలుగేళ్లు, ఒక స్థానానికి రెండేళ్ల పదవీ కాలం ఉంది. ఈ క్రమంలోనే ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగుబోతున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, టీడీపీ (TDP) నుంచి మరోసారి బీద మస్తాన్ రావు (Bida Matan Rao) మరోసారి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
ఆ పార్టీతోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం పరిణామాలతో ఆయన వైసీపీ (YCP)లో చేరి 2022లో రాజ్యసభకు వెళ్లారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోవడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. తాజాగా ఆయన తిరిగి చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరి రాజ్యసభ బరిలో నిలవబోతున్నారు. ఇక బీజేపీ (BJP) నుంచి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) బరిలో నిలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్పట్లో వైసీపీ (YCP) నుంచి ఆయనను రాజ్యసభకు పంపడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓటమి పాలు అవ్వడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి మరోసారి రాజ్యసభ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. ఇక మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana) రాజీనామాతో ఖాళీ అయిన స్థానం టీడీపీ (TDP) నేత సానా సతీష్ (Sana Sathish)కు కేటాయించే ఛాన్స్ ఉంది. కేవలం రెండేళ్ల పదవీ కాలం ఉన్న ఈ స్థానంపై టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.