అక్కడ రాజధాని జగనే ఒప్పుకున్నాడు.. సీఎంపై గంటా విమర్శలు

by Ramesh Goud |   ( Updated:2024-03-06 13:46:12.0  )
అక్కడ రాజధాని జగనే ఒప్పుకున్నాడు.. సీఎంపై గంటా విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండటానికి ఒప్పుకున్నాడని, అధికారంలోకి వచ్చాక మాట మార్చాడని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. విశాఖ విజన్ పై స్పందించిన ఆయన.. సీఎం జగన్ మాటలు ఒట్టి భూటకం అని అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా అంగీకరించాడని, అలాగే రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని, దానికి స్వాగతిస్తున్నట్లు కూడా చెప్పాడన్నారు.

అధికారంలోకి వచ్చాక మాట మార్చి, మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చాడన్నారు. కానీ ఈ ఐదేళ్లలో ఒక్క రాజధానికి కూడా న్యాయం చేయ్యలేదని, కర్నూల్ న్యాయ రాజధానిలో హైకోర్టు కోసం కనీసం అప్పీలు చేయలేదని, వైజాగ్ లో విలాసవంతమైన క్యాంపు ఆఫీస్ కట్టుకున్నాడే తప్ప రాజధాని కోసం చిన్న నిర్మాణం కూడ చేయలేదని మండిపడ్డారు. ఏమైనా అంటే రాజధాని పై కేసులు ఉన్నాయని అంటున్నారని, కేసులున్నా కూడా రిషికొండ ప్యాలెస్ ఎలా కట్టారని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు వారం రోజులు ఉండగా.. విశాఖ విజన్ డాక్యుమెంట్ బయటపెట్టడం జగన్ చిత్తశుద్దిని తెలియజేస్తుందని, ఎన్నికల అనంతరం విశాఖలో ఉంటానని జగన్ అంటున్నారని, అది జరిగే పని కాదని అన్నారు.

Read More..

మెగా బ్రదర్ నాగబాబుకు టికెట్ ఉందా లేదా..?

Advertisement

Next Story