- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా లక్ష్యం అదే.. ఐదేళ్ల పాలనపై క్లారిటీ ఇచ్చేసిన పురంధేశ్వరి
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి ఘన విషయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు సైతం విజయఢంకా మోగించారు. భారీ మెజార్టీలతో విజయం కైవసం చేసుకున్నారు. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీల నేతలు గెలుపొందారు. రాజమండ్రి నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆమెను కేంద్రంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఎన్డీయే సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే చేపట్టేబోయే ఐదేళ్ల పాలనపై పురంధేశ్వరి స్పందించారు.
‘ఎన్డీయే కూటమికి ప్రధాని మోడీ సరికొత్త నిర్వచనం చెప్పారు. ఎన్ అంటే న్యూ, డి అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఏస్మిరేషన్ ఆఫ్ పీపుల్ ఇండియా మోడీ అని తెలిపారు. ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో అదేవిధంగా కూటమి ఐదేళ్లు పని చేస్తుంది. పదేళ్ల పాటు కూటమి అధికారంలో కొనసాగాలి. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమాన్ని కొనసాగిస్తాం.’ అని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు.