వరద బాధితులకు చేయూతగా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు

by srinivas |   ( Updated:2024-09-06 02:44:05.0  )
వరద బాధితులకు చేయూతగా  రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు
X

దిశ, రాజమహేంద్రవరం: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చారు. జైలు పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ నేతృత్వంలో పాతిక వేల మందికి టమాటా బాత్ (ఉప్మా) ప్యాకెట్లు సిద్ధం చేసి గురువారం విజయవాడకు పంపించారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు, జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ప్రోద్బలంతో ఖైదీలు శ్రమించి టమాటా బాత్ తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్‌లో 300 గ్రాముల ఉప్మాను ప్యాక్ చేశారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వీటిని విజయవాడలోని బాధితులకు అందించేందుకు పంపించారు. గతంలో కరోనా సమయంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు లక్ష మాస్కులు తయారు చేసి ఇచ్చారు. ఖైదీలు మానసిక పరివర్తన ద్వారా తమ వంతు మానవతా సహాయాన్ని అందించడం ఎంతో ఆనంద దాయకమని సూపరింటెండెంట్ శ్రీరామ్ రాహుల్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed