- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Polavaram:స్కూల్ ఆవరణలో వర్షపు నీరు..రామాలయంలో విద్యాభ్యాసం
దిశ,పోలవరం:చదువుకునేందుకు బడి ఉన్నా చినుకు పడితే చిత్తడే..బడికంటే గుడి బెటర్ అనుకుంటున్నారు ఆ పాఠశాల విద్యార్ధులూ, టీచర్లు..గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం పంచాయతీ నూతన గూడెం ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో భారీ స్థాయిలో వర్షపు నీరు చేరింది. పాఠశాల ఆవరణంతా మోకాలు నీటిలో మునిగిపోవడంతో పాఠశాల లోపలికి వెళ్లేందుకు టీచర్, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. పాఠశాలలోకి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో పై అధికారుల ఆదేశాల మేరకు సమీపంలో ఉన్న రామాలయంలోకి విద్యార్ధులను తీసుకువెళ్ళారు.
టీచర్లు అక్కడే వారితో గురువారం విద్యాభ్యాసం చేయించారు. పాఠశాలకు సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలిచిపోతోంది. దీంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని టీచర్లు వాపోతున్నారు. డ్రైనేజీ తవ్వించి వర్షపు నీటి సమస్య లేకుండా పరిష్కరించాలని అధికారులను కోరామని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయురాలు రమణ ఇతర ఉపాధ్యాయ, ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో నీటిని తొలగించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.