- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rain Alert:రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయాన్నే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఓ వైపు భగభగ మండే ఎండ, మరోవైపు వడగాల్పులతో మనుషులే కాదు పశుపక్ష్యాదులు సైతం విలవిలలాడుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) చల్లటి కబురు చెప్పింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) వెల్లడించింది. దీంతో అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తరుణంలో పలుచోట్ల వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఏపీలోని 23 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.