Breaking News: విజయవాడలో అల్లకల్లోలం.. ఎటూ చూసినా వర్షపు నీరే..!

by srinivas |   ( Updated:2024-08-31 14:25:06.0  )
Breaking News: విజయవాడలో అల్లకల్లోలం.. ఎటూ చూసినా వర్షపు నీరే..!
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే ఏపీలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు విజయవాడ, గుంటూరులోనూ వర్షం కుమ్మేసింది. దెబ్బతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. నగరంలో ఎటు చూసినా వర్షపు నీళ్లే కనిపిస్తున్నాయి. నెహ్రూ బస్టాండ్ మొత్తం నీట మునిగింది. ఆర్టీసీ బస్సులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై మోకాళ్లోతు నీరు చేరడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల వర్షం దాటికి ఇళ్ల గోడలు కూలిపోయాయి. వర్షం దాటికి జనజీవనం స్తంభించిపోయింది. దుర్గమ్మ ఘాట్ వైపు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. టెంపుల్‌లోకి బండరాళ్లు పడ్డాయి. దీంతో అధికారులు తొలగిస్తున్నారు.

Advertisement

Next Story