- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Big Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజులు వడగళ్ల వాన

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. తీవ్రమైన ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల ఎండలు పెరిగితే, మరికొన్ని చోట్ల వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించిందనే చెప్పవచ్చు. కానీ పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికి అందివచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) భరోసా ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) మరోసారి రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన, ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల(clouds) ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద ఉండరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.