AP News : ఏపీ ఎన్నికల సర్వే బయటపెట్టిన రఘురామకృష్ణంరాజు

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-22 12:54:38.0  )
AP News : ఏపీ ఎన్నికల సర్వే బయటపెట్టిన రఘురామకృష్ణంరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తాను చేయించిన సర్వేను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బయటపెట్టారు. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందన్నారు. ఇక కడప జిల్లాలో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తన సర్వేలో తేలిందన్నారు. ఇక ప్రకాశం, గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉందన్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, టీడీపీ, వైసీపీ , జనసేనల మధ్య గట్టి పోటీ ఉందన్నారు.

నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గంలో జనసేనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తన సర్వే రిపోర్టును బయటపెట్టారు. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ప్రస్తుతం టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 54 ఉన్నాయని, 39 సీట్లలో టీడీపీకి ఎడ్జ్ ఉందన్నారు. ఇక వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 10 మాత్రమే ఉన్నాయని, వైసీపీకి ఎడ్జ్ ఉన్న నియోకవర్గాలు 4 ఉన్నాయన్నారు. 68 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉందన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వార్ వన్ సైడ్ అవుతుందని, వైసీపీకి కష్టమేనని అన్నారు.

భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story