- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..! రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్తగా వచ్చే ఏడాది నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్న ప్రభుత్వం.. త్వరలో అధికారిక నిర్ణయాలు ప్రకటించనుంది. అదే విధంగా పేరెంట్స్ కమిటీతో భేటీ, టీచర్ల బదిలీలపైన నిర్ణయం తీసుకోనుంది.
సమూల మార్పులకు శ్రీకారం..
రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బేసిక్ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలుగా నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్న అధికార యంత్రాంగం తాజాగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. తాజా ప్రతిపాదనల మేరకు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మంది లోపు వరకు ఒక ఎస్జీటీ, 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు ఎస్జీటీలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జీటీ, 120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించనుంది.
ప్రాథమికోన్నత విధానం రద్దు!
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల విధానం పూర్తిగా రద్దు చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించనున్నారు. వాటిల్లో 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలలుగా మార్చాలని నిర్ణయించారు. పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలోనే షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్స్, బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
బదిలీల్లో కీలక మార్పులు
ఉపాధ్యాయుల బదిలీల్లో కీలక మార్పుల దిశగా విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రతీ ఏటా మేలో బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇక నుంచి కేటగిరీల వారీగా సర్వీసును పరిగణలోకి తీసుకోనుంది. ప్రధానోపాధ్యాయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు, ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకునేలా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏ 16శాతం ఉన్న వాటిని కేటగిరి-ఏ, 12శాతం ఉంటే కేటగిరి-బీ, 10 శాతం ఉంటే కేటగిరి-సీ, 5 వేల కంటే తక్కువగా ఉంటే కేటగిరి-డీగా ఖరారు చేయనున్నారు.
లోకేశ్ మార్క్ సంస్కరణలు
విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగా, దానిని కొనసాగిస్తూ లోకేశ్ తన మార్క్‌ను సెట్ చేస్తున్నారు.