మంచం కింద కొండచిలువ: కడప ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఘటన

by Seetharam |   ( Updated:2023-11-16 07:20:13.0  )
మంచం కింద కొండచిలువ: కడప ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం రేపింది. బాయ్స్ హాస్టల్-2లో ఓ విద్యార్థి మంచం కింద కొండ చిలువ నక్కి ఉంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. కొండచిలువను చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది హాస్టల్ వద్దకు చేరుకున్నారు. కొండ చిలువను గోనెసంచిలో బంధించారు. అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. దీంతో విద్యార్థులతోపాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story