- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala : రీల్ కోసం తిరుమల కొండ పై పుష్ప 2 'కిస్సిక్' పాటకు డాన్స్.. వైరల్ గా వీడియో
దిశ, వెబ్ డెస్క్ : యువతలో సెల్ఫీలు, రీల్స్ పిచ్చి వారిని కొన్నిసార్లు ప్రమాదాలకు, వివాదాలకు గురి చేస్తున్నప్పటికి వాటిపై మోజు వదలడం లేదు. ఓ యువతి పవిత్ర తిరుమల(Tirumala) కొండ మార్గంలో పుష్ప-2(Pushpa 2) మూవీలోని 'కిస్సిక్' (Kissik')పాటకు డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్ స్ట్రా పేజీలో పోస్ట్ చేసింది. రీల్ కోసం తిరుమల కొండ పై ఆ యువతి చేసిన పుష్ప 2 'కిస్సిక్' పాట డాన్స్ వీడియో వైరల్ గా మారింది. దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు.
సినిమా పాటలో నటించిన హీరోకు దెబ్బలేమోగాని రీల్స్ చేసిన యువతి మాత్రం విమర్శల పాలవుతోంది. కాగా తిరుమల సందర్శన క్రమంలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహాన లేకుండా రీల్స్ చేస్తు, వీడియోలు తీస్తూ కొందరు, డ్రోన్ కెమెరాలు ఎగరెస్తూ మరికొందరు వివాదాలు, కేసుల పాలవుతున్నారు. తాజాగా తిరుమల కొండ మార్గంలో పుష్ప 2 'కిస్సిక్' పాట డాన్స్ వీడియోపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.