- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పురంధేశ్వరి టీడీపీ తరఫున వకల్తా పుచ్చుకున్నారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసమే పురంధేశ్వరి పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం డిస్టలరీల విషయంలో పురంధేశ్వరి వాస్తవాలు తెలియకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి చంద్రబాబు తరపున ఆమె వకల్తాపుచ్చుకుంటే తప్పులేదని కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. మద్యంపై చంద్రబాబుతో పురంధేశ్వరి మాట్లాడితే బాగుంటుందని చెప్పుకొచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాశ్‌ను ఆశీర్వదించాలని కోరారు.
చంద్రబాబు కోసమే పురంధేశ్వరి
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ తరఫున వకల్తా పుచ్చుకోవడాన్ని ఆ పార్టీ నేతలు సైతం తప్పుబడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా చంద్రబాబు వదినగా మాట్లాడాతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే టీడీపీ కోసం పనిచేయడాన్ని అంతా గర్హిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు..