- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్న పవన్.. ఈ రోజు చంద్రబాబుతో చర్చలు.. పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పొత్తుల అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విజయవాడలో చర్చలు జరిపారు. కొద్దిసేపటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో పవన్‌తో పాటు బీజేపీ నాయకులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. పొత్తులపై బీజేపీకి ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు. తాను చర్చలకు వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం పవన్ కల్యాణ్ తో చర్చించారని, ఇవాళ చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. చర్చల సారాంశాన్ని బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని పురంధేశ్వరి పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో ఉన్నారని, పొత్తులపై పోటీ విషయంలో ఎవరికి ఆందోళన లేదన్నారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయంతోనే అన్ని జరుగుతాయని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
Read More..
BREAKING: కంట తడి పెట్టుకున్న డిప్యూటీ CM, తట్టుకోలేక కూతురు సైతం కన్నీళ్లు