- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PSLV C-59: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టీం
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఇస్రో శాస్త్రవేత్తల(ISRO Scientists) టీం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం శ్రీహరి కోట(Sriharikota) నుంచి ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్(PSLV C-59 Rocket) ప్రయోగానికి మంగళవారం కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ నేపధ్యంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం(Success) కావాలని ముందుగా శ్రీవారి దర్శనం చేసుకున్నామని ఇస్రో శాస్త్రవేత్తల టీం తెలిపింది. కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, బుధవారం సాయంత్రం 4.06 నిమిషాలకి శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం (SHAR) నుంచి పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్‌ని ప్రయోగించబోతోంది. ఈ రాకెట్‌లో ప్రోబా-3 (Proba-3) మిషన్ ఉంది. ఈ ప్రయోగం ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు.