- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభోత్సవం జరగనుంది. కాగ ఈ ప్రారంభోత్సవానికి మోడీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు మధ్యాహ్నాం పాలసముద్రానికి చేరుకుంటారు. అనతరం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత మోడీ అకాడమీలోని కేంద్రాలను సందర్శించనున్నారు. సందర్శన అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులను కలిసి కాసేపు వారితో ముచ్చటించనున్నారు.
ఆ తరువాత ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్నిమోడీ విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రసంగం ముగిసాక N.A.C.I.Nకు మోడీ గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. ఇక ఈ కార్యక్రమం ముగుసాక ప్రధాని మోడీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించుకుని సాయంత్రం తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. కాగ ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, అలానే వైసీపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది