చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోడీ

by Mahesh |
చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో  కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సమావేశం వేదిక పై ప్రధాని మోడీ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. స్టేజీ మీద నుంచి దిగడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్ ను చేతితో పట్టుకొని మోడీ మరో చేతిలో మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని స్టేజీ మధ్యలో నిలబడి అభివాదం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా సమావేశంలోని కార్యకర్తలు, అభిమానులు కేరింతలు పెట్టారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. కాగా ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Advertisement

Next Story

Most Viewed