చిలకలూరిపేట ప్రజాగళం సభకు చేరుకున్న ప్రధాని మోడీ

by srinivas |   ( Updated:2024-03-17 12:00:23.0  )
PM Modi Says, Nepotism and Corruption Indias Biggest Challenges On occasion of independence day
X

దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజా గళం సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి తొలుత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి చిలకలూరిపేట సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ హెలికాప్టర్‌తో పాటు మరో రెండు భద్రత సిబ్బంది హెలికాప్టర్లు కూడా చేరుకున్నాయి. అనంతరం ప్రజా గళం సభ వద్దకు ప్రధాని మోడీ వెళ్లారు. దీంతో సభ వద్దకు ప్రధాని మోడీని నారా లోకేశ్ సహా బీజేపీ, జనసేన నాయకులు ఇక సభ వద్దకు మోడీ చేసుకోవడంతో ఆ ప్రాంగణమంతా జై మోడీ.. జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్ నినాదంతో సభ దద్దరిల్లింది. అంతకుముందే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రజాగళం సభ ప్రారంభంకానుంది. ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Read More..

ప్రధాని మోడీ ట్వీట్‌పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story