- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవర సినిమా టికెట్ల ధరల పెంపుదల 10రోజుల వరకే : ఏపీ హైకోర్టు
దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హైబడ్జెట్ మూవీ ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపుదలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేవర టికెట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను విచారించిన కోర్టు పిటీషనర్ వాదనతో ఏకీభవించింది. దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవర మూవీ టీమ్ అడిగిన మేరకు టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్‍లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో దేవర సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు మూవీ టీమ్‍కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది.
సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ.110, లోయర్ క్లాస్ టికెట్‍పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చంటూ సెప్టెంబర్ 21న జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు టికెట్లపై అదనపు ధరలను రెండు వారాల నుంచి 10రోజులకు పరిమితం చేసింది. కాగా దేవర చిత్రానికి తొలి రోజు ఆరు షోలు.. ఆ తర్వాత 9 రోజులు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Read More..
AP High Court: నటి జత్వానీ కేసులో కీలక పరిణామం.. విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట