కనకదుర్గమ్మకు టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ

by Seetharam |
కనకదుర్గమ్మకు టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సభ్యులు మేకా శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు మీడియాతో మాట్లాడారు. టీటీడీ దేవస్థానం తరపున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు. కనకదుర్గమ్మ కరుణా కటాక్షాలు, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు చేసినట్లు మేకా శేషుబాబు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి అందరికీ చేరువకావాలని...ఆయన నిర్ణయాలు ఫలించాలని అమ్మను ప్రార్ధించామని మేకా శేషుబాబు తెలిపారు.

Advertisement

Next Story