- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరోసారి ప్రకాశ్‌రాజ్ సెటైర్లు.. తెగ వైరల్ అవుతున్న ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బహుభాష వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) స్పందించారు. ఈ మేరకు తాాజాగా ఎక్స్ వేదికగా మరోసారి ఆయనను ప్రశ్నించారు. ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్‌కి ఎవరైనా చెప్పండి.. అంటూ ప్రకాశ్‌రాజ్ సెటైరికల్ ట్వీట్ వేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఇంత పీత బుర్ర ఏంటి సార్ మీది? అక్కడ చెప్పిన పాయింట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? మీ సలహాలు మడిచి మీ దగ్గరే పెట్టుకోండి.. అని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే? జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో పవన్ కళ్యాణ్ హిందీ వివాదంపై మాట్లాడారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా అని అన్నారు. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించిందన్నారు. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండని అన్నారు. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలని, హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. తమిళనాడులో పెరినప్పుడు తాను వివక్ష అనుభవించినట్లు వివరించారు. గోల్టీ.. గోల్టీ అని తనను అవమానించారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.