Prakash Raj: మంచు విష్ణుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్

by Hamsa |
Prakash Raj: మంచు విష్ణుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వివాదం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో, చేప నూనెతో తయారు చేస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్‌ను ట్యాగ్ చేసి ఓ సంచలన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

మీరున్న రాష్ణంలోనే ఇలా జరుగుతుంది. కాబట్టి దీనిపై విచారణ జరిపి నేరస్థులను కనిపెట్టండి డిప్యూటీ సీఎం అని అన్నారు. ఇక ఈ పోస్ట్‌పై మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. ‘‘దయచేసి మీరు అంతలా నిరుత్సాహపడి అసహనం చేయాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. మీ పరిధిలో మీరు ఉంటే మంచిదని హెచ్చరించారు. తాజాగా, ప్రకాష్ రాజ్ X వేదికగా మంచు విష్ణుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒకే శివయ్య, నా దృష్ణకోణం నాకు ఉంది. అలాగే మీకు కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ అడుగుతున్నా’’ అని కామెడీ ఎమోజీలను పెట్టాడు. ప్రజెంట్ ప్రకాష్ రాజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

For Praksh raj ట్వీట్ : https://x.com/prakashraaj/status/1837415184098369538





Next Story