Breaking: ఉద్రిక్తత.. గొడ్డళ్లు, కర్రలతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

by srinivas |   ( Updated:2023-06-18 16:21:56.0  )
Breaking: ఉద్రిక్తత.. గొడ్డళ్లు, కర్రలతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. గొడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల తోకపల్లిలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఇరు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా చిన్న పాటి వివాదంతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story