Ongole: ఈసారి జనసేనకు అవకాశం ఇస్తాం..!

by srinivas |
Ongole: ఈసారి జనసేనకు అవకాశం ఇస్తాం..!
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‎కు ఓ అవకాశం ఇస్తామని ఒంగోలు 9వ డివిజన్ ప్రజలు తెలిపారు. జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు 40 రోజులుగా ఒంగోలులో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఒంగోలు 9వ డివిజన్ నాయకులు నరసింహారావు, పి.రాజేంద్ర ఆధ్వర్యంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఈ సారి పవన్ కల్యాణ్‌కు కూడా ఒక అవకాశం ఇస్తామని చెప్పారు. పవన్ చేసిన కార్యక్రమాలు తమను ప్రభావితం చేశాయని చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేనాని సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు ఉపాధి రావాలన్నా, రైతన్నకు అండగా నిలవాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా అది పవన్ కల్యాణ్ పాలనతోనే సాధ్యమౌతుందని పేర్కొన్నారు.

జనసేన నాయకులు మాట్లాడుతూ తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed