Breaking: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

by srinivas |
Breaking: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్ వద్ద గన్ ఫైరింగ్ కలకలం రేగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారు. యూనియన్ బ్యాంకులో వెంకటేశ్వర్లు సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం తుపాకీతో కాల్పుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడు చిమకుర్తి వాసిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒంగోలు కోర్టు సెంటర్‌లో ఒక్కసారిగా గన్ కాల్చిన శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Next Story