Ap News: రాజకీయాల్లోకి రిటైర్డ్ ఐఏఎస్​ ఆఫీసర్.. 23 నుంచి రాష్ట్ర పర్యటన

by srinivas |
Ap News: రాజకీయాల్లోకి రిటైర్డ్ ఐఏఎస్​ ఆఫీసర్.. 23 నుంచి రాష్ట్ర పర్యటన
X

దిశ, ఏపీ బ్యూరో: విశ్రాంత ఐఏఎస్​ అధికారి జీఎస్​ఆర్​కేఆర్​ విజయకుమార్​ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారనేది స్పష్టం చేయకున్నా ఈ నెల 23 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఒంగోలులో పలు సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గతంలో ప్రకాశం జిల్లా కలెక్టరుగా పని చేసినందున ప్రకాశం జిల్లా స్థితిగతులపై ఓ అవగాహన ఉందని, తడ నుంచి తుని వరకు యాత్ర చేపట్టి అణగారిన వర్గాల సమస్యలపై మరింత అధ్యయనం చేయున్నట్లు విజయకుమార్​ వెల్లడించారు. ఈ యాత్రలో దళిత, బలహీన, బడుగు వర్గాలు పాల్గొని ఆయా వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story