- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sunkesula: రోడ్డు కోసం నడుం బిగించిన ఆటో డ్రైవర్లు... సొంతంగా మరమ్మతులు
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్లు గుంతలమయంగా మారింది. ఈ గుంతలతో ప్రయాణికులకే కాదు వాహనాలు సైతం తరచూ మరమ్మత్తులకు గురవుతున్నాయి. రోడ్ల దుర్భర పరిస్థితి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఆటో డ్రైవర్లు రోడ్డు వేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆటోడ్రైవర్లు అంతా కలిసి సొంతంగా రోడ్డుకు మరమ్మత్తులు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
సుంకేసుల గ్రామం వెళ్లే రోడ్డు దారుణంగా తయారయ్యింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పలువురు గుంతల్లో పడి గాయాలపాలైన దాఖలాలు సైతం ఉన్నాయి. అయితే రోడ్డు వేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక రోడ్డు కోసం ఆటో డ్రైవర్లు నడుం బిగించారు. గుంతలు ఉన్నచోట మట్టిని వేసి పూడ్చారు. రోడ్లు బాగు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.