- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ongole: మంచినీళ్లిస్తారా లేదా?.. బాలినేనికి అల్టిమేటం
దిశ, దక్షిణ కోస్తా: ‘‘ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు ప్రాంతాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారు. నగరపాలక సంస్థకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే నిద్ర లేచింది మొదలు ఇళ్ల పట్టాల జపం చేస్తున్నారు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇంతకీ మీరు నీళ్లిస్తారా ! లేకుంటే మేమే ట్యాంకర్లతో అందిస్తాం” అంటూ జన సైనికులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం జన సైనికులు శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలు 16వ డివిజన్ జన చైతన్య యాత్ర చేపట్టారు. కనీసం తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి పాతిక వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యే ఊరిస్తున్నట్లు చెప్పారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని, ఇళ్ల పట్టాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కనీసం శివారు కాలనీల్లో ముందుగా తాగు నీరందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ట్యాంకర్లతో తామే సరఫరా చేస్తామని వెల్లడించారు. యాత్రలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ముత్యాల కల్యాణ్, నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, నాయకులు గోవింద్ కోమలి, కోట సుధీర్, బంగారు సురేష్, ఉంగరాల వాసు, శ్రీనివాస్, నరసింహారావు, నరేష్, సుధీర్, కర్రి శ్రీను, శీలం సాయి పాల్గొన్నారు.