- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Inter Exams: అయ్యో పాపం.. 20 నిమిషాలు ముందు వెళ్లి ఉంటే బాగుండేది..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల సీజన్ కొనసాగుతోంది. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష జరిగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. అయితే ఆ విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. పరీక్ష కేంద్రంలోనికి వెళ్లనివ్వలేదు. దీంతో ఓ విద్యార్థిని అక్కడే కన్నీటి పర్యంతమైంది. ఆ విద్యార్థినిని మహిళా పోలీసులు ఓదార్చి అక్కడ నుండి పంపించారు.
మరోవైపు ఇంటర్ పరీక్ష రాసేందుకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గేటు తీయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండడంతో చిన్న సందులో నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. గేటుకు తాళం వేసిన వాచ్‌మెన్ ఎక్కడికో వెళ్లాడని తెలిపారు. తాళం చెవి వాచ్ మెన్ దగ్గరే ఉందని పేర్కొన్నారు. దీంతో ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.