- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి సమక్షంలో ఇజ్రాయిల్ పేట ఆర్చి వివాదానికి తెర
X
దిశ, ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం ఇజ్రాయిల్ పేట ముఖద్వారా నిర్మాణం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గత ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో కొందరికి గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఎర్రగొండపాలెం వీధులలో సహారా కాశారు. అనంతరం ఎమ్మార్వో రవీందర్ 144 సెక్షన్ అమలు చేసి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బెటాలియన్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి. ఇక ఎప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ సమస్య సమసిపోయింది.
Advertisement
Next Story