- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chirala మాజీ ఎమ్మెల్యే ఆమంచికి అగ్నిపరీక్ష!
- పర్చూరు ఇన్‌చార్జిగా వెళ్తారా?
- జనసైనికుల్లో చేరిపోతారా?
- స్వతంత్రంగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటారా?
దిశ, దక్షిణ కోస్తా: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Former Mla Amanchi KrishnaMohan) భవితవ్యం నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. బాపట్ల జిల్లా చీరాల (Chirala) నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమంచికి ఇప్పుడు ఏం చేయాలి?, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే సందిగ్ధంలో పడ్డారు. వైసీపీ అధిష్టానం పర్చూరు ఇన్‌చార్జిగా వెళ్లమంటోంది. అక్కడ గెలుస్తామనే నమ్మకం లేదు. జనసేన (Janasena)లో చేరితే ఎలా ఉంటుందో అంచనా దొరకడం లేదు. అసలు ఈ గోలంతా ఎందుకు?, చీరాల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారా అంటే.. ఈ మూడు ఆప్షన్లలో జనసేన లేదా స్వతంత్రంగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వారసుడిగా రాజకీయాల్లోకి..
ఆమంచి కృష్ణమోహన్మొట్టమొదట 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌పార్టీ జడ్పీటీసీగా వేటపాలెం నుంచి గెలిచారు. తర్వాత కొణిజేటి రోశయ్య ప్రోత్సాహంతో 2006లో దేశాయిపేట ఎంపీటీసీగా గెలిచి అదే వేటపాలెం ఎంపీపీ అయ్యారు. 2004లో చీరాల నుంచి పోటీ చేసిన రోశయ్యను విజయ తీరానికి చేర్చడంలో ఆమంచి కీలక పాత్ర పోషించారు. తర్వాత రోశయ్య ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన వారసుడిగా 2009లో చీరాల నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత కాంగ్రెస్‌పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారు.
ప్రధాన పార్టీలను మట్టి కరిపించి స్వతంత్ర ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పతనమైంది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి బరిలోకి దిగారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులను మట్టి కరిపించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక 2015 సెప్టెంబరు 3న టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలి వీస్తుందని గ్రహించారు. 2019 ఫిబ్రవరి 13న వైఎస్జగన్సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.
బలరాం వైసీపీలో చేరడంతో ఆమంచి పట్టు సడలిందా !
గత ఎన్నికల్లో చీరాల్లో జగన్గాలి పారలేదు. టీడీపీ నుంచి కరణం బలరామ కృష్ణమూర్తి విజయం సాధించారు. అనతికాలంలోనే ఆయన కుమారుడికి సీటు ఇచ్చే ఒప్పందంతో వైసీపీలో చేరారు. ప్రస్తుతం బలరాం కుమారుడు వెంకటేష్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. గడచిన మూడున్నరేళ్లుగా ఆమంచి, బలరాం వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఇటీవల జడ్జిలపై ఆమంచి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంకా పలు పాత కేసులు ఆమంచిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈమధ్యనే బలరాం, ఆమంచిని పిలిపించి సీఎం జగన్‌మాట్లాడారు. పర్చూరు ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టేందుకు అయిష్టంగానైనా అంగీకరించినట్లు సమాచారం.
అక్కడ గెలుపు అంత తేలిక్కాదు !
పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానిదే పెత్తనం. అందులోనూ బలంగా పాతుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై గెలవడం అంత తేలిక్కాదు. గత రెండు దఫాలు వైసీపీ అభ్యర్థుల ఎంపికలో వేసిన తప్పటడుగులతో టీడీపీ బలం పుంజుకుంది. ఇక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం ఈసారి జనసేనకు మారే అవకాశముంది. ఏరకంగా చూసినా తన గెలుపు సాధ్యం కాదని భావించినట్లున్నారు. టీడీపీతో దోస్తీ కుదిరితే జనసేనలో చేరి చీరాల నుంచి బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నారు. అది వీలుకాకుంటే మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా చీరాలలోనే అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా ఇప్పుడు ఆమంచి తీసుకునే నిర్ణయం ఆయన రాజకీయ భవితవ్యానికి అగ్ని పరీక్ష అవుతుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Read more: