Bapatla: చంద్రబాబుకు సంఘీభావం.. 15 మందిపై కేసు నమోదు

by srinivas |   ( Updated:2023-09-22 13:07:08.0  )
Bapatla: చంద్రబాబుకు సంఘీభావం.. 15 మందిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీలో విచారించానున్నారు. అయితే చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా చంద్రబాబుకు ఇంటర్నేషనల్ అవార్డీ ఆర్టిస్ట్ బాలాజీ వరప్రసాద్ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ పలువురు టీడీపీ నేతలతో కలిసి బాపట్ల బీచ్‌లో చంద్రబాబు శాండ్ ఆర్ట్ వేశారు.

అయితే పోలీసులు సీరియస్ అయ్యారు. 15 మందిపై కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు వైసీపీ కార్యకర్తల్లా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షం నొంతు నొక్కుతోందని మండిపడ్డారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిందని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed