PPS Survey: ఏపీలో ఆ పార్టీదే విజయం.. 104 సీట్లతో విజయం

by srinivas |   ( Updated:2024-03-09 14:36:57.0  )
PPS Survey: ఏపీలో ఆ పార్టీదే విజయం.. 104 సీట్లతో విజయం
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు ఎవరిదనే విషయంపై ఏపీలో ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై పలు ప్రైవేటు సంస్థలు సర్వే చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ సర్వేలో వెల్లడైన విషయాలు బయటపెట్టాయి. కొన్ని వైసీపీకి అనుకూలం కాగా.. మరికొన్ని టీడీపీ అధికారంలోకి వస్తాయని చెప్పాయి.

తాజాగా పయోనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ రాష్ట్రంలో ఎన్నికల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కూటమిదే విజయమని తేల్చింది. 104 సీట్లతో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపింది. వైసీపీ 49 స్థానాల్లో గెలుపొందుతోందని చెప్పింది. మరో 22 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. టీడీపీకి కూటమికి 51.4 శాతం ప్రజలు జైకొట్టగా అధికార వైసీపీకి 42.6 శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేశారు. ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమికి 18 సీట్లు వస్తాయని, మిగిలిన వైసీపీ గెల్చుకుంటుందని పేర్కొంది.

దీంతో టీడీపీ కూటమి నేతలు హర్షం వ్యకం చేస్తున్నారు. ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎంకావడం ఖాయమని చెబుతున్నారు. అటు వైసీపీ నేతలు సైతం తమదే విజయమని అంటున్నారు. మరి ఎన్నికల వేళ చాలా సర్వేలు విడుదలవుతున్నాయి. ఎన్నికలు జరిగి, ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల పోలింగ్, ఫలితాలు విడుదలయితేనే ఏ పార్టీది అధికారమనేది తెలుస్తోంది. అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.

Read More..

ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనకు సిద్ధమైన సీఎం జగన్

Advertisement

Next Story

Most Viewed