- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APPSC:బిగ్ అలర్ట్.. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా
దిశ,వెబ్‌డెస్క్: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. అయితే.. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన నిర్వహించబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష (APPSC Group 2 Mains Exam)ను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ (APPSC) కమిషన్‌ని కోరారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం పెంచాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-2 మెయిన్స్(APPSC Group 2 Mains) పరీక్ష గడువును పెంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను https://portal-psc.ap.gov.in/ సందర్శించాలని సూచించింది.