AP RESULTS: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం

by srinivas |
AP RESULTS: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం
X

దిశ, వెబ్ డెస్క్: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో సైకిల్ జోరు కొనసాగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన నుంచి ట్రెండ్ టీడీపీ వైపు సాగుతోంది. ప్రస్తుతం రెండు స్థానాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య బయటకు వచ్చాయి. రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేశారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లలో వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుపై 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి ముందజలో ఉన్నారు.



Next Story