- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ–జనసేన పొత్తు.. ఆ పార్టీలతోనూ కలిస్తే ఇక తిరుగుండదా?
ఈసారి ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగిస్తుందని శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. గతనెల 12 నుంచి 30 వరకు చేపట్టిన ‘మూడ్ ఆఫ్ ఏపీ’ సర్వే ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. టీడీపీ–జనసేన పొత్తుతో 50 శాతం ఓటింగ్ సాధిస్తుందని సర్వేలో తేలింది. అదే వామపక్షాలతో కలిసి ముందుకెళ్తే 54 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది. బీజేపీతో కలిసి పోటీ చేస్తే వైసీపీదే పైచేయి అవుతుందని స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనంతరం జనసేనాని పొత్తు ప్రకటించిన తర్వాత సర్వే చేశారు. అందువల్ల చంద్రబాబుపై సానుభూతి పెరగడంతోపాటు రెండు పార్టీల పొత్తుకు ఓటర్లు సానుకూలంగా స్పందించినట్లు కన్పిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: శ్రీ ఆత్మ సాక్షి సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తుల్లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తే టీడీపీ 86, వైసీపీ 68, జనసేన 6 స్థానాలు గెల్చుకుంటాయి. 15 స్థానాల్లో నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే టీడీపీ 95, జనసేన 13, వైసీపీ 60 సాధిస్తాయి. 7 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన పోటీ చేస్తే వైసీపీకి 98 నుంచి 100, మూడు పార్టీల కూటమికి 70 నుంచి 75 దక్కవచ్చు. ఏడు స్థానాల్లో గట్టిపోటీ ఉండొచ్చు. అదే టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీకి దిగితే ఈ కూటమికి 115 నుంచి 122, వైసీపీకి 56 నుంచి 58 వస్తాయి. నాలుగు స్థానాల్లో ఉత్కంఠ పోరు ఉండొచ్చు.
విడివిడిగా పోటీ చేస్తే..
పొత్తులేమీ లేకుండా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 41.5 శాతం, టీడీపీకి 44 శాతం, జనసేనకు 10 శాతం, బీజేపీకి 0.50 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు దక్కే అవకాశాలున్నాయి. అదే టీడీపీ–జనసేన పొత్తుతో వైసీపీ మీద తలపడితే ఆ రెండు పార్టీలకు కలిపి 50 శాతం, వైసీపీకి 43 శాతం, బీజేపీకి అరశాతం, ఇతరులకు 4.5 ఓట్లు రావొచ్చు. సైలెంట్ ఓటింగ్ రెండు శాతం ఉండొచ్చు.
బీజేపీతో కలిస్తే డేంజర్..
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీ మీద పోటీ చేస్తే మూడు పార్టీలకు కలిపి కేవలం 43 శాతం ఓట్లు రావచ్చు. వైసీపీకి 47 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కవచ్చు. అదే టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తే ఈ కూటమికి 54 శాతం, వైసీపీకి 43 శాతం, బీజేపీకి 0.75 శాతం ఓట్లు పోలయ్యే అవకాశముంది.
సీఎంగా ఆయనవైపే మొగ్గు..
ముఖ్యమంత్రిగా ఎవరుంటే బావుంటుందనే సర్వేలో సీఎం జగన్‌కు 46 శాతం, చంద్రబాబుకు 40 శాతం, పవన్ కల్యాణ్‌కు 9 శాతం మంది ఓటర్లు జై కొట్టినట్లు శ్రీ ఆత్మ సాక్షి సర్వే పేర్కొంది. ఇతరులు రెండు శాతం, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని వాళ్లు మూడు శాతం ఉన్నట్లు తెలిపింది. టీడీపీ – జనసేన కలసి పోటీ చేస్తే రెండు పార్టీల ఓట్లు బదిలీ ఏమేరకు అవుతాయనే ప్రశ్నకు 50 శాతం మంది పూర్తి స్థాయిలో ఓట్లు బదిలీ అవుతాయని చెప్పారు. ఓట్ల బదిలీ కష్టమని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు. కొంతమేర ఓట్లు బదిలీ అవుతాయని 15 శాతం మంది, తెలీదంటూ చెప్పిన వాళ్లు 5 శాతం ఉన్నట్లు సర్వే వివరించింది.
2019లో అంచనాలకు దగ్గరగా ఫలితాలు..
ఇదే శ్రీ ఆత్మ సాక్షి సంస్థ 2019 ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలో వైసీపీకి 139–142 అసెంబ్లీ సీట్లు, 23 ఎంపీ సీట్లు దక్కుతాయని వెల్లడైంది. అలాగే, టీడీపీకి 22 నుంచి 28 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. నాటి ఎన్నికల ఫలితాలు అంచనాలకు చాలా దగ్గరగా ఉండడం గమనార్హం. ఇప్పుడు చేసిన సర్వేకు సంబంధించి విద్యార్థులు, యువకులు, రైతులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్దిదారులు, ఇతర సామాజిక వృత్తులకు సంబంధించిన వాళ్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు శ్రీ ఆత్మ సాక్షి నిర్వాహకులు వివరించారు.