విశాఖలో పొలిటికల్ హీట్.. ఎంపీ, ఎమ్మెల్సీ మధ్య తారాస్థాయికి మాటల యుద్ధం

by srinivas |   ( Updated:2024-02-16 12:27:31.0  )
విశాఖలో పొలిటికల్ హీట్.. ఎంపీ, ఎమ్మెల్సీ మధ్య తారాస్థాయికి మాటల యుద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. వైసీపీ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటోంది. ప్రధానంగా ఎంపీ ఎంవీవీ అక్రమాలు, అరాచకాలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేదంటే ఇంటికొచ్చి కొడతానని వంశీ హెచ్చరించారు. దమ్ముంచే వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపించాలని ఎంవీవీకి వంశీ సవాల్ చేశారు. జైల్లో తన్నులు తిని వచ్చి ఎంపీగా గెలిచావ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ చరిత్రలో దరిద్రమైన ఎంపీగా నిలిచిపోతావ్ అంటూ ఎంవీవీపై వంశీ వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్పొరేటర్ వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ వంశీకి తనను విమర్శించే స్థాయి లేదని సూచించారు. వంశీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. వంశీది బ్రహ్మానందంలాంటి కేరక్టర్ అని ఎద్దేవా చేశారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చెప్పారు. తాను కల్తీ సారాలు అమ్ముకుని ఈ స్థాయికి రాలేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed