- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీటెక్ రవిని పోలీసులే చంపేందుకు ప్లాన్..కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: సీఎం రమేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ నేత సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవిని అరెస్టు చేసిన విధానంపై మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు. కడప సెంట్రల్ జైల్లో మంగళవారం బీటెక్ రవిని సీఎం రమేశ్ కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 14న బీటెక్ రవిని కిడ్నాప్ చేసి పోలీసులు చంపేయాలకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. యువగళం పాదయాత్ర కేసును సాకుగా చూపించి కడప నగర శివార్లలో వాహనంలో నుంచి దింపి పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు అని ఆరోపించారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారన్నారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది. పులివెందులలో అంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెట్టావు?, సునీతమ్మ, లూథ్రాలు ఏమైనా చేస్తామని చెప్పారా? అంటూ బీటెక్ రవిని పోలీసులు పదేపదే బెదిరించారని సీఎం రమేశ్ ఆరోపించారు.