హోంమంత్రి, ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు..మాజీ మంత్రి సోదరుడికి నోటీసులు

by srinivas |   ( Updated:2024-09-14 06:54:33.0  )
హోంమంత్రి, ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు..మాజీ మంత్రి సోదరుడికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha), కడప ఎమ్మెల్యే మాధవీలతపై ( Reddeppagari Madhavi Latha) సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అనిత, మాధవీలతపై వైసీపీ శ్రేణులు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీని వెనుక మాజీ మంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని సూచించారు. అహ్మద్ బాషా ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story