- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో పురోగతి
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. భూ లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మార్వో హత్య తర్వాత నిందితుడు విశాఖ ఎయిర్ పోర్టు వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. అంతేకాదు నిందితుడు రైల్వే టికెట్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. రమణయ్య హత్యకు ముందు నిందితులు చాలా సార్లు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు గుర్తించారు. త్వరలో నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఇద్దరు ఏసీపీలను నియమించారు. విశాఖ ఎస్పీ ఆధ్వర్యంలో కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విశాఖలోని అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అంతేకాదు నిందితుడికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిందితుడు మరింత దూరం పారిపోయే ఛాన్స్ ఉండటంతో పూర్తి వివరాలు బయట పెట్టడంలేదని విశాఖ సీపీ రవిశంకర్ పేర్కొన్నారు.
కాగా విశాఖ రూరల్ చినగదిలి తహశీల్దార్ రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. అయితే విశాఖలోని కొమ్మదిలో ఓ ఆపార్ట్ మెంట్‌లో ఉంటున్నారు. శుక్రవారమే బొండపల్లిలో ఎమ్మార్వోగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం తిరిగి వచ్చి విశాఖ నివాసంలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఫోన్ రావడంతో ఆయన అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకి వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై దుండగులు ఇనుపరాడ్‌తో దాడి చేశారు. దీంతో ఎమ్మార్వో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం అయింది. చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శనివారం కొంత పురోగతి సాధించారు.