- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీమంత్రి పరిటాల సునీత పట్ల పోలీసుల తీరు అమానుషం: అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల శాంతియుత ఆందోళన కార్యక్రమాలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారు అని మండిపడ్డారు. అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత నిరవధిక దీక్షను అప్రజాస్వామికంగా అడ్డుకున్నారు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. పరిటాల సునీత పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళల పట్ల కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారు అని ధ్వజమెత్తారు. పౌరుల హక్కులను కాలరాస్తూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు తగిణ గుణపాఠం చెబుతారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.