Nandigama: చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు.. ముగ్గురు అరెస్ట్

by Rani Yarlagadda |   ( Updated:2024-11-23 10:41:25.0  )
Nandigama: చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ హయాంలో.. ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu Naidu) ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామ (Nandigama)లో జరిగిన రాళ్ల దాడి కేసులో ఏపీ పోలీసులు (AP Police) ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో భాగంగా.. వాహనంపై అభివాదం చేస్తూ వెళ్తుండగా స్ట్రీట్ లైట్స్ ను ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలయ్యాయి.

వెంటనే ఈ ఘటనపై కేసు పెట్టినా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు కేసులో పురగోతి సాధించారు. నిందితులుగా భావిస్తున్న కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


Read More..

Seki Agreement: జగన్‌కు అదానీ ముడుపుల వ్యవహారం.. సంచలన విషయాలు చెప్పిన బాలినేని

Advertisement

Next Story