ఆ గ్రామంలో ‘పొలం బడి’ కార్యక్రమం

by Jakkula Mamatha |
ఆ గ్రామంలో ‘పొలం బడి’ కార్యక్రమం
X

దిశ, జగ్గంపేట:జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రెడ్ల శ్రీరామ్ గురువారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో వరి పండించే రైతాంగాన్ని సమీకరించి వరి నారుమడి లో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలని అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ వరిలో తెల్ల దోమ, నల్ల దోమ, పచ్చ దోమతో పాటు రకరకాల దోమలను లింగాకర్షక బుట్టలు ఆకర్షించే వాటిని నశింపజేస్తాయన్నారు. అందువల్ల రైతాంగం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని వివరిస్తూ వాటి నిర్వహణ పై రైతులకు అవగాహన కల్పించారు. ఎకరానికి 10 బట్టలు చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed