- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీపై కాంగ్రెస్ ఫోకస్.. ప్రియాంక గాంధీతో అమరావతిలో భారీ సభకు ప్లాన్..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. 2014లో ఏపీ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన పలు హామీలు మరుగున పడిపోయాయి. కొన్ని హామీలు సగంలో నిలిచిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే రాహుల్ లాంటి నేతలతో చెప్పించారు. మరోవైపు విభజన హామీలను బీజేపీ విస్మరించిందని బలంగా వినిపిస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ బీజేపీ వైఖరిని తప్పుబడ్డుతున్నారు. ఇప్పుడు వీటినే ఎన్నికల ఆయుధాలుగా మలుచుకుని పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలు ముగియకముందే ఏపీలో కూడా పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తూ తాజాగా లేఖ రాశారు. ఏపీకి ఇచ్చిన హామీలపై ఈ సభలో కీలక ప్రకటన చేయించాలని అనుకుంటున్నారు. ఏపీ రాజధాని, ప్రత్యేక ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు విశాఖ రైల్వే జోన్‌తో పాటు రాయలసీమకు ప్రత్యేక నిధులు వంటి అంశాలపై ప్రియాంకగాంధీతో హామీ ఇప్పించాలని చూస్తున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీకి రాష్ట్ర అధ్యక్షుడు గిడుకు రుద్రరాజు లేఖ రాశారు. అమరావతి రాజధాని అంశంపై భారీ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని... ఈ సభకు తమరు హాజరుకావాలని, అందుకు తగిన సమయం ఇవ్వాలంటూ లేఖలో కోరారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రియాంక గాంధీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.