- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:‘షరతులకు కట్టుబడి ఉంటా బెయిలివ్వండి’ ..హైకోర్టులో పిన్నెల్లి
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల సమయంలో పలు చోట్ల అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ చేశారు. ఈక్రమంలో తాజాగా నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును కోరారు. పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లు రేపు (సోమవారం) విచారణకు రానున్నాయి. మే 13న పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ను పిన్నెల్లి ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారు. నాగ శిరోమణి అనే మహిళను బూతులు తిట్టారు. జూన్‌లో అరెస్టైన పిన్నెల్లి అప్పటి నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఆయన దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లనూ కింది కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.