- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. కొందరు ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కొందరు ఐపీఎస్‌లు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈఓకి ఫిర్యాదు చేశామని బోండా ఉమ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని బోండా ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనిపైనా ఎన్నిక సీఈఓకు ఫిర్యాదు చేశామని బోండా ఉమ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.