ఏసీబీ అధికారులమంటూ ఫోన్.. రెవెన్యూ ఉద్యోగులకు సైబర్ నేరగాళ్ల టోకరా

by Ramesh Goud |
ఏసీబీ అధికారులమంటూ ఫోన్.. రెవెన్యూ ఉద్యోగులకు సైబర్ నేరగాళ్ల టోకరా
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ అధికారులమని (ACB Officials) చెప్పి రెవెన్యూ అధికారులకు (Revenue Officers) సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) టోకరా వేశారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ (Target) చేసి, భయబ్రాంతులకు గురి చేసి అందినకాడికి దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో అమాయకులతో పాటు సాఫ్ట్ వేర్ (Software) సహా ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) కూడా మోసపోతున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రభుత్వ అధికారులు మోసపోయిన ఘటన నరసరావు పేట (Narasarao Peta) రెవెన్యూ కార్యాలయంలో (Revenue Office) జరిగింది. తహసీల్దార్ కార్యాలయన్ని (Tahasildar Office) లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏసీబీ అధికారులం అంటూ నరసరావు పేట తహసీల్దార్ (Narasarao Peta Tahasildar) కు బెదిరింపు కాల్ (Call) వచ్చింది.

డిప్యూటీ తహసిల్దార్ (Deputy Tahasildar) 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ (Red Handed) గా పట్టుకున్నామని చెప్పి సైబర్ కేటుగాళ్లు డబ్బులు (Money) డిమాండ్ (Demand) చేశారు. అంతేగాక ఆర్ఐ (RI) ను కూడా బెదిరింపులకు గురి చేసి గూగుల్ పే (Google Pe) ద్వారా 70 వేలు కాజేశారు. ఇలా వరుస ఫోన్లు రావడంతో కలవరపాటుకు గురైన రెవెన్యూ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులం అని చెప్పి తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులకు ఫోన్లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. మొదట కంగారు పడ్డ అధికారులు ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సైబర్ నేర నియంత్రణ అధికారులకు (Cyber Crime Office) ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed