జనవరి 1 నుంచే ఫేజ్ -2 జగనన్న ఆరోగ్య సురక్ష

by srinivas |
జనవరి 1 నుంచే ఫేజ్ -2 జగనన్న ఆరోగ్య సురక్ష
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఫేజ్ -2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి మండలంలో గ్రామ సంచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అర్బన్ ప్రాంతంలో వచ్చే సరికి వారంలో ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అర్బన్ ప్రాంతాలో ప్రతి బుధవారం ఆరోగ్య సురక్ష కింద వైద్యం అందించనున్నారు, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు మిగిలిన ప్రాంతాల వాళ్లకు కూడా సేవలు అందించాలని నిర్ణయించారు. స్కీనింగ్, మందులు , చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు అండగా నిలవనున్నార. డయాలసిస్ రోగులు వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్‌తో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేయనున్నారు. మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్యం అందించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీల్లో నెఫ్రాలజీ, యూరాలజీ సేవలు అందించాలని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed