ఓటు లేని వాళ్లు ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు : షర్మిలపై మంత్రి బొత్స కామెంట్స్

by Shiva |   ( Updated:2024-01-25 12:26:52.0  )
ఓటు లేని వాళ్లు ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు : షర్మిలపై మంత్రి బొత్స కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి వైసీపీ ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందో చెప్పాలంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటు లేని వాళ్లు కూడా ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడి వచ్చి ఉద్దారిస్తామంటే జనం వారిని నమ్మే పరిస్థితుల్లో లేని అన్నారు. ఆనాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. నేటికీ విభజన హామీలు అమలుకాకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీయేనని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా షర్మిల నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.

Advertisement

Next Story