వైనాట్ 175 అంటున్న జగన్.. వైసీపీకి నో ఓట్ అంటున్న జనం: టీడీ జనార్దన్

by sudharani |   ( Updated:2023-03-17 07:39:55.0  )
వైనాట్ 175 అంటున్న జగన్.. వైసీపీకి నో ఓట్ అంటున్న జనం: టీడీ జనార్దన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటివని టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ అన్నారు. తొమ్మిది జిల్లాల్లోని 108 నియోజకవర్గాల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఇచ్చిన తీర్పు ఇది అని చెప్పుకొచ్చారు. పీకే సర్వేలు.. పిచ్చి సర్వేలతో తమను మోసం చేయలేరని ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టం చేశారన్నారు.

ఇది ప్రజా సర్వే.. తిరుగులేని సర్వే అని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో ఇంతకు మించిన స్థాయిలో వైసీపీ ఘోర ఓటమి చవి చూడడం ఖాయమన్నారు. వై నాట్ 175 అని ప్రశ్నిస్తోన్న జగనుకు వైసీపీకి నో ఓట్ అంటూ ప్రజలు ఇచ్చిన సమాధానం ఇది. ఈ ఫలితాలు ప్రజా తిరుగుబాటేనని టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story